శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
601. దక్షయజ్ఞ వినాశినీ | ||
దక్షుడి యజ్ఞ ద్వంసానికి కారకురాలు ఈశ్వర తత్వము లేని యాగమును ధ్వంసం చేయునది. కుండలిని సాధన ప్రయాణ మార్గ మధ్యన కలిగే ఆటంకాలను ధ్వంసం చేస్తుంది. మూలాధారము నుండి సహస్రార వరకు వెళ్లి అక్కడనుండి బ్రహ్మా శిర్షమునకు చేరే ప్రయాణమే దక్షయజ్ఞ🙏 🌺ఏకాగ్రత్తతో సాధించే ధర్మ కార్యక్రమాలకు ఎటువంటి అడ్డంకులు రాకుండా కాపాడుతుంది. 🌺 |