శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
616. ఆదిశక్తి | ||
మూలకారణ శక్తి మహామాయా స్వరూపమే ఆదిశక్తి. అనంత సృష్టికి మూల కారణమైన పరమేశ్వరియే ఆదిశక్తి. సమస్త విశ్వాన్ని నడిపించే ఒక దివ్య శక్తి, దివ్యమైన, స్వచ్ఛమైన, శాశ్వతమైన చైతన్య స్వరూపిణి . అఖండ సత్యమైన పరాశక్తికి నమస్కారము 🙏 🌺మన దినచర్యలో వేసే ప్రతి అడుగు పరాశక్తి ప్రసాదించిన చైతన్యశక్తితో నే సాధ్యము అన్న జ్ఞానము కలుగుతుంది 🌺 |