శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
651. విజ్ఞాత్రీ | ||
విజ్ఞానమును ప్రసాదించునది సమస్త విజ్ఞానమును తెలుసుకొను శక్తియే విజ్ఞాత్రీ. పూర్వాపరములు , జీవులయొక్క జనన మరణములు,పూర్వ కర్మములు, సృష్టి సంకల్పము,శాస్త్ర బోధ ఇత్యాదులు సకలము తెలిసియున్న పరా దేవతా. అట్టి విజ్ఞానమూర్తి గనుకనే ఆమె విజ్ఞాత్రి అనబడింది 🙏 🌺జీవాత్మలోనే పరమాత్మ అన్న విజ్ఞానాన్ని తెలుసుకోవడము ప్రారంభిస్తాము 🌺 |