శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
608. దేవేశి | ||
బ్రహ్మది దేవతలకు ఈశ్వరి ముక్కోటి దేవతలకు ఈశ్వరి, అధిష్టాత్రి. బ్రహ్మది దేవతలంతటి వారే పరశక్తిని నిరంతరము ధ్యానిస్తూ వుంటారు కదా... అలాగే ఈ సృష్టి కి మూలమైన పరమేశ్వరీకి మనము కూడా నిరంతరము ఆమె సేవ యందు, పూజ యందు ఆసక్తి చూపుతూ, వందనాలు అర్పించాలి 🙏 🌺 మానవ జన్మ అతి విలువైనది. ప్రమేశ్వరి మనకి ప్రసాదించిన ఈ విలువైన జన్మను, ధర్మ మార్గమున నడిచి సార్ధకం చేసుకుందాము. 🌺 |