శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
663. అజాజైత్రి | ||
ఆసురీ తత్వమును జయించినది. అజ్ఞానము అన్న చీకటిని పారద్రోలునది. అజా అన్న జ్ఞానము భగ్నము కాకుండా కాపాడుతుంది పరమేశ్వరి. అప్రమత్తముగా వున్నపుడు అజ్ఞానము అన్న అంధకారమును పోగొట్టి జ్ఞానము అన్న వెలుగుని ప్రసాదిస్తుంది. వెలుగు రూపేణ వున్న పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺అహంకారము అన్న అజ్ఞానపు చీకటిని తొలగించి నిరహంకారము అన్న వెలుగు మనలో ప్రకాశిస్తుంది.🌺 |