శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
645. సర్వవేదాంత సంవేద్యా | ||
అన్ని వేద శాస్త్రములు చక్కగా తెలియుట సర్వ వేదాంతమునకు అతీతమైనది. బ్రహ్మా తత్వమును తెలుసుకొనుటయే సర్వవేదాంత సంవేద్యా. జీవాత్మ పరమాత్మ వేరు కాదు అని తెలియుటయే బ్రహ్మా తత్వము. సర్వ వేదములకు రూపమైన లలితా పరమేశ్వరీకి నమస్కారము 🙏 🌺సర్వం ఖల్విదం బ్రహ్మా అన్న సూక్తిని తెలుసుకొని, జీవితములో ఎదురుకొనే పరిణామాలు,మన వివేకాన్ని పెంచుతాయి. 🌺 |