శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
624. గుహ్యా | ||
రహస్యమైనది మానవుడు తనలోనే వున్న పరమేశ్వరిని తెలుసుకోలేక, అజ్ఞానమైన వస్తువులయందు వెతుకుతాడు, విఫలమై రాగ ద్వేషములకు లోబడుతాడు. మన హృదయములోనే రహస్యముగా దాగి వున్న పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺'ఏకం సత్ విప్రా బహుధా వదంతి'.సత్యం ఒక్కటే'' దానిని జ్ఞానులు బహువిధాలుగా చెపుతారు. రహస్యముగా వున్న సత్యాన్ని తెలుసుకోడానికి ప్రయత్నిస్తాము 🌺 |