శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
607. గుహజన్మభూ: | ||
కుమార స్వామికి తల్లి గుహ అన్న పదము కాంతిని సూచిస్తుంది.పరాశక్తి యొక్క కాంతి రూపమే కుమార స్వామి. దేవతల సైన్యానికి నాయకుడు. రాక్షసులను సంహరించడానికి సహజమైన ధీరత్వము పొందినవాడు. మోక్ష ప్రాప్తి కొరకు చేసే దైవధ్యానమునకు ఆటంకములు కలగకుండా, తన కుమారుడి కాంతి రూపముతో పరమేశ్వరీ సాధకుడిని రక్షిస్తుంది🙏 🌺 మన ధర్మాన్ని మనము అనుసరిస్తూవున్నవారికి, ధర్మమే అజ్ఞాన్నాని పోగొట్టి, రక్షణ కలిగిస్తుంది. 🌺 |