శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
670. వసుదా | ||
సంపదలిచ్చునది మనసా, వాచా, కర్మణా, త్రికరణ శుద్ధితో తనను కొలిచే వారికి సంపదలను ఇచ్చు శక్తి స్వరూపిణి. శ్రీచక్ర అష్ట కోణములే అష్ట వసువులు. వసువు అంటే సంపద.అష్ట సంపదలను ఇచ్చు ఆది పరాశక్తికి నమస్కారము 🙏 🌺లౌకిక సంపదలను కోరుకోవడము అజ్ఞానము. మరియొక్క జన్మను కోరుకున్నట్టే, ఆ పరాశక్తిని మోక్ష ప్రాప్తికి కావలిసిన జ్ఞానమును ప్రసాదించమని వేడుకోవాలి. 🌺 |