శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
642. అపరిచ్చేద్యా | ||
అంతటా వ్యాపించి వున్నది కాలమునకు, రూపమునకు దేశమునకు,సర్వమునకు అతీతమైనది. ఇక్కడ వున్నది,అక్కడ లేదు అని భాగింపరానిది.పరమేశ్వరీ తత్వమును ఎవ్వరు ఎంతగా తెలుసుకోవాలని ఎదురు చూస్తారో, వారికి అంతగా బాసించుతుంది 🙏 🌺ప్రతి ఒక్కరిలో పరమేశ్వరిని చుడాలి అన్న గుణము వ్యాప్తి చేస్తాము 🌺 |