శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
686. రాజ్యదాయినీ | ||
వరప్రసాదిని పరమేశ్వరీ వరదాయిని. అమె ఇవ్వలేనిది ఏమియు వుండదు. శ్రధ్దా భక్తులచే పరమేశ్వరీ యొక్క పాదాల చెంత చేరితే అష్ట ఐశ్వర్యములను ప్రసాదిస్తుంది. రాజ్యము, భోగ భాగ్యాలు అనుభవించటము వంటి ఐశ్వర్యములు తరిగి పోతాయి, కాని అసలైన ఐశ్వర్యము మోక్ష ప్రాప్తి. దాని కొరకు ఆకాంక్షిస్తున్న భక్తులను తనలో లయము చేసుకొని, మోక్ష సామ్రాజ్యాన్ని ప్రసాదిస్తుంది రాజ్యదాయినీ 🙏 🌺సమాజములో మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదిస్తాము . 🌺 |