శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
634. శైలేంద్రతనయా | ||
పర్వత రాజ పుత్రి హిమవంతుని పుత్రిక గా ఆవిర్భవించి శివుని పతిగా పొందిన పరమేశ్వరీ. హిమవత్పర్వతము శ్రేష్టమైనది. అందుకే దాన్ని శైలేంద్రము అంటారు. ఆ పరమేశ్వరి హిమవంతుని గర్భానపుట్టింది కాబట్టి శైలేంద్రతనయా🙏 🌺తల్లిని ఆరాధించిన వారికి సమస్త పాపాలూ తొలగిపోతాయి. ఇహపర సుఖాలు సంప్రాప్తిస్తాయి.🌺 |