శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
690. రాజ్యలక్ష్మీ | ||
వైభవమును ప్రసాదించునది అనేక సంపదలను, భోగభాగ్యములను ప్రసాదిస్తూ విష్ణుమూర్తి ధర్మపత్ని గా ప్రకాశించు పరమేశ్వరీయే రాజ్యలక్ష్మి. డబ్బు మాత్రమే సంపద అని భావించడము సముచితం కాదు. సమయస్ఫూర్తితో వ్యవహరించడము, సద్గుణములు, ఆరోగ్యము కలిగి వుండటము, పెద్దలతో మాట్లాడేటప్పుడు సంస్కారము కలిగి వుండటము వంటివి కూడా సంపదగా భావించాలి. సమయానుకులముగా సంపదను ప్రసాదించే రాజ్యలక్ష్మీకి నమస్కారము 🙏 🌺సత్ గుణముతో, పరమేశ్వరీ అనుగ్రహ సంపదను పొందవచ్చు 🌺 |