శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
614. కావ్యాలాప వినోదిని | ||
కావ్యాలాపనచే ఆనందము పొందునది ఇచ్చా, జ్ఞాన, క్రియా శక్తి అన్నియు తాను సృష్టించినవే. సంగీతము, సాహిత్యములకు విలువ ఇచ్చునది. సరస్వతి స్వరూపము. కావ్య రచన చేసి, గానము చేసి, ఆ మాధుర్యాన్ని అమితముగా ఆనందిస్తుంది. కావ్య రూపములో స్తుతిస్తే, పరమేశ్వరీ ఎంతగానో సంతోషిస్తుంది 🙏 🌺మాతృ భాష పట్ల అవగాహన పెరుగుతుంది. 🌺 |