శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
637. విశ్వగర్భా | ||
విశ్వమంతయు తన గర్భమున ధరించినది సకల జగత్తు,దేవి గర్భమునుండే జన్మించినది, కనుక పరమేశ్వరీ విశ్వగర్భా అన్న నామముతో పూజింపబడుతుంది. బ్రహ్మాండ జనని , సమస్త సృష్టిని బిందు రూపేణ తన గర్భమున ధరించినది. శ్రీ చక్ర బిందు రూపమే విశ్వగర్భా. ప్రతి మాతృ మూర్తి రూపమును దాల్చిన పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺శరీరములో గర్భము ప్రధాన భాగము. వాటికి సంబందించిన అస్వస్థత నయమౌతుంది.🌺 |