శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
678. భాషారూపా | ||
సమస్తభాషలు తన రూపములో వున్నవి భాషా జ్ఞానము కలిగి వున్నది.మన భావనను వ్యక్తపరిచేది భాష. మాటలు వచ్చిన వారు భాషను ఉపయోగించి పది మందికి మేలు చేయగలగడం దైవత్వం. మనసుతో మాట్లాడే భాష రూపములో వున్న 'భావనా మాత్ర సంతుష్టయైన' పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺భాష లో గొప్పదనము, ఎదుటి వారి కష్టం అర్ధం చేసుకొని మాట సహాయం చేయడములో వున్నది 🌺 |