శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
652. వేద్యవర్జితా | ||
తెలుసుకోవాల్సింది ఏమిలేదు ఎవరైతే సర్వము తెలిసి ఉంటారో, అలాంటి విజ్ఞానమూర్తులనే విజ్ఞాత్రులు , వేద్యవర్జితా అని అంటారు. లలితాపరమేశ్వరీ తనకు బయటా లోపల అను భేదం లేక సర్వము తానగుటచే తనకు తెలియవలసినదేమీ లేదు. అందుచే ఆమె వేద్యవర్జితా 🙏 🌺మనిషియొక్క విద్య తనకు తెలిసినది తక్కువ అనే వాస్తవం విషయము గ్రహించి ఆ వినయము వలన రాణిoచబడుతారు .🌺 |