శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
629. త్రిదశేశ్వరీ | ||
త్రిదశలకు ఈశ్వరి. నిత్య యవ్వన దశలు కలిగి వున్న ఈశ్వరి. మనిషి యొక్క సర్వ దశలయందు, అవి బాల్య , యవ్వన, కౌమార, వార్ధక్యమైనను వారిలో, చైతన్య స్వరూపిణిగా యవ్వనాన్ని ప్రసాదిస్తుంది🙏 🌺నిరంతరము మంచి ఆలోచనలు కలిగి వున్న వారికి దృడమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. 🌺 |