శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
628. త్రిమూర్తి: | ||
త్రిమూర్తి స్వరూపము శ్రీచక్ర బిందు త్రికోణ శక్తియే త్రిమూర్తి. సృష్టి, స్థితి, లయకారకులైన త్రిమూర్తి స్వరూపము. పరమేశ్వరీ యొక్క అంశ నుండి ఆవిర్భవించిన బ్రహ్మి, రౌద్రి, వైష్ణవి కూడా త్రిమూర్తి: అని పూజింపబడుతారు. లోక నిర్వహణకు సత్వ, రజ, స్తమో గుణములు కూడా త్రిమూర్తి యొక్క రూపములే. త్రిమూర్తి రూపములో వున్న పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺 త్రిమూర్తి స్వరూపమైన ఆదిపరాశక్తి గాయత్రి స్వరూపములో త్రికాల సంధ్యావందనము ఆచరించే వారి పట్ల కరుణా, వాత్సల్యమును కురుపిస్తుంది. 🌺 |