శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
612. కళాత్మికా | ||
కళాస్వరూపిణి సృష్టిలో వున్న సమస్త కళలు, అన్ని పరాశక్తి స్వరూపములే. అరువది నాలుగు కళలు కాకుండా, అగ్ని కళలు, సూర్య కళలు, చంద్ర కళలు మొత్తము కలిపేతే 360 కళలుగా చెపుకోవచ్చును. అన్ని కళలకు ఆత్మ స్వరూపిణిగా వున్న పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺కళ అన్నది పరాశక్తి యొక్క ప్రసాదము, అనుగ్రహము అని గుర్తుంచుకోని, వాటిని ఆత్మార్పణ చేయాలి 🌺 |