శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
606. గోమాతా | ||
నాలుగు వేదముల వేద సారము సృష్టి అంతయు తన విశ్వ గర్భమునుండి ఆవిర్భవింపచేసిన జగన్మాతయే గోమాతా. గో యొక్క నాలుగు పాదములే నాలుగు వేదములు. కామధేనువు స్వరూపమైన గాయత్రీ దేవియే గోమాత. గో పూజ, గో సేవ, గో గ్రాసము సమర్పించిన వారికి సాక్షాత్ పరమేశ్వరిని సేవించునట్టి ఫలితము లభిస్తుంది. సమస్త సంపదలను ప్రసాదించే గోమాతకు నమస్కారము 🙏 🌺సకల శుభములు కలుగుతాయి 🌺 |