శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
650. దృశ్య రహితా | ||
నిర్వికార రూపము నిర్గుణ, నిర్వికార రూపము అన్నది దృశ్య రహితా. రూపములేనిది, జ్యోతి స్వరూపిణిగా ధ్యానములో సాక్షాత్కరించునది. అనంత బ్రహ్మండములో వున్న అన్ని రూపములు తల్లి సృష్టించినవే. అన్ని రూపములు ఆ పరా జగన్మాతవే. నిర్వికార రూపమైన పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺ధ్యానములో కలిగే అనుభూతిని పొందుతాము 🌺 |