శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
662. అష్టమూర్తి | ||
దుర్గా స్వరూపిణి అష్టకష్టములనుండి విముక్తి కలిగించు స్వరూపము . దుర్గతి అనగా మనలో వుండే చెడు బుద్ధి, అహంకారము,, లోభము,మోహము, ఈర్షా, రాగము ద్వేషము కోపము,వంటి అష్ట గుణములను తరిమికోడుతుంది. అష్ట సంఖ్య యందు వున్న శక్తి స్వరూపము అని భావించగలము. అష్టమూర్తి యొక్క రూపమును ధరించి వున్న పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺దుర్గతిని పోగొడుతుంది. సకల శుభములను ప్రసాదిస్తుంది. 🌺 |