శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
699. సర్వార్ధధాత్రీ | ||
సర్వార్ధమును ప్రసాదిస్తుంది ధర్మ, అర్ధ, కామ్య, మోక్ష ప్రధాయిని. మనిషి యొక్క పుట్టుక, భగవంతుడిని తెలుసుకొనుటకై సమయము గడపాలి. మనిషి జీవితము అప్పుడే సార్ధకము. భవ బంధాలు శాశ్వతము కాదు, మోక్ష ప్రాప్తియే సర్వార్ధము. బుద్ధిని సర్వార్ధమును తెలుసుకొనుటకై ప్రేరణ చేసే పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺కోరిన కోర్కెలను తీరుస్తుంది. 🌺 |