శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
636. గంధర్వ సేవితా | ||
గంధర్వులచే సేవింపబడునది ఆట పాటలలో మొదలైన వాటితో దేవతలను మెప్పించే వారు. గంధర్వులు సప్తగణాల్లో ఒకరు. అందచందాలు, రూపలావణ్యాల్లో గంధర్వులు వారికి వారే సాటి. సంగీతాన్ని కేవలం ప్రక్రియగా కాకుండా, మోక్షాన్ని పొందడానికి సర్వోన్నతమైన మార్గముగా ఎంచుకున్న వారు,నారదుడు, తుంబురుడు, దేవతల్లో ప్రత్యేకంగా గుర్తింపు పొందారు 🙏 🌺భూమిపై తాము చేసిన పుణ్య కర్మల ప్రభావంతో గంధర్వ జన్మ పొందిన మనుషులను మానవ గంధర్వులంటారు. పుట్టుకతోనే గంధర్వులుగా ఉన్నారు అన్న గుర్తింపు పొందుతారు 🌺 |