శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
625. కైవల్యపదదాయినీ | ||
మోక్షస్థితి ప్రధాయిని ఐహిక బంధములనుంచి ముక్తి పొందడమే మోక్ష స్థితి. కర్మలన్నింటిని పరిత్యజించి, పర బ్రహ్మాను ధ్యానించుట అన్నది కైవల్య ప్రదదాయినం. కర్మలను మానివేయడం అన్నది కాదు, నిత్య, నైమిత్తిక కర్మలను చేస్తూ, అంతా పరమేశ్వరార్పణమస్తు అన్న జ్ఞానము తో చేయాలి. కైవల్యపదదాయినీయైన పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺ప్రతి నిత్యము చేసే కర్మలు అన్ని పరమేశ్వరీ ఇచ్చిన శక్తి తోనే సాధ్యము. ఆ శక్తిని మంచి ఆలోచనలతో స్థిరముగా కాపాడుకోవాలి. 🌺 |