శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
620. అనేకకోటి బ్రహ్మాండజననీ | ||
అనేక కోటి బ్రహ్మాండములను సృష్టించినది సృష్టిలో కోట్లానుకోట్ల బ్రహ్మండములు కలవు, ఆదిశక్తియే వాటికి జనని. మహా జల రాశి నడుమ పరిభ్రమిస్తున్న అనేక కోటి బ్రహ్మాండములలో మనది భూలోకము. ఈ భూమండలానికి అఖండకోటి శక్తి స్వరూపిణిగా, జీవులను సృష్టించిన పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺తల్లి యొక్క దీవెనలను పొందుతాము 🌺 |