శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
644. జ్ఞాన విగ్రహా | ||
విద్యా అవిద్యా స్వరూపిణి పరమేశ్వరియొక్క రూపమే జ్ఞాన విగ్రహా. విద్యా అవిద్యా యందు ఈశ్వర స్వరూపమే దాగివున్నది అన్నదే పూర్ణ జ్ఞానము. గురు రూపమే జ్ఞాన విగ్రహా. ఎందరో గురువులు మన సనాతన ధర్మాన్ని రక్షిస్తున్నవారికి వందనాలు 🙏 🌺తనను సేవించు వారిపై జ్ఞానాన్ని విస్తారంగా ప్రకాశిస్తుంది. 🌺 |