శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
604. గురుమూర్తి | ||
అజ్ఞానము అన్న చీకటిని పోగొట్టునది బ్రాహ్మజ్ఞానము కలిగి వున్నటువంటి గాయత్రీ స్వరూపము. సమస్త సృష్టికి ఆద్య గురువైన గాయత్రీ స్వరూపము. మనిషి రూపములో వున్న గురువే గాయత్రీ స్వరూపమైన గురుమూర్తి. మంత్ర దీక్ష ద్వారా మనలోని అహంకారమును, అజ్ఞానమును తొలగించి, జ్ఞానబోధను చేసే గురువే ---దేవి నామము-- గురుమూర్తి. అన్నింటికీ మూలమైన పరా లలితాపరమేశ్వరికి నమస్కారము 🙏 🌺గురుబోధనలు విన్నందు వలన , అన్ని సమస్యలు పరిష్కరించబడుతాయి. 🌺 |