శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
605. గుణనిధి | ||
గుణ సంపదతో నిండి వున్నది గురు పాదములను నమ్మకముతో పట్టుకున్న వారికి నిధి వంటి గుణములు సమయానుకూలముగా లభిస్తాయి. ప్రతి మనిషిలో సత్వ, రజో, తమో గుణములు కలుగుతాయి. ధర్మ పదములో నడిచే వారికి ఈ గుణముల వల్ల కలిగే నష్టము, లాభము అన్న వ్యత్యాసమును ముందుగా తెలుసుకుంటారు. సత్త్వగుణం వల్ల జ్ఞానం, రజోగుణం వల్ల మోహం, తమోగుణం వల్ల అజాగ్రత్త, అవివేకం వంటి ఫలితాలు లభిస్తాయి. గుణ సంపద రూపములో ప్రకటించే పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺మనిషి తన జీవన ప్రయాణములో ఏన్నో అనుభవాలు. గుణాల ఆస్థియే మన అనుభవాలు. 🌺 |