శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
679. బృహత్సేనా | ||
సేనా సమూహముతో వున్నది అనంత సైన్యము పరమేశ్వరీ యొక్క కడగంటి చూపుతో సృష్టించిబడినవి. పరాశక్తి ఆజ్ఞ ను అమలు చేసి జయము చేకూర్చే గొప్ప శక్తి, సేనా వాహినిది.అమ్మవారు వేద మాత. చతుర్వేద మంత్రములు, పరమేశ్వరీని స్తుతిస్తూ సేనా సమూహముగా వుంటాయి. శక్తి సేనా వాహిని సమూహములో వున్న పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺ధర్మ మార్గమున నిలచిన ప్రతి యొక్క శక్తి సేనవాహిని సభ్యులకు పరమేశ్వరీ యొక్క అభయము తప్పకుండా లభిస్తుంది.🌺 |