శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
615. సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవితా | ||
లక్ష్మి ,సరస్వతుల చే వింజామరముతో సేవింపబడునది చామరము వీచుతూ కుడి ఎడమ నిలచి వున్న రమా, వాణిలచే సేవలనందుకుంటున్న లలితా పరమేశ్వరీ. కుండలిని స్వరూపమైన పరమేశ్వరీ ఇడా, పింగళా రూపములో వున్న రమా, వాణిలచే సేవింపబడునది అని అంతర్యాగ, రహోయాగ రహస్యము🙏 🌺సంపద, సంస్కారము అన్నవి లక్ష్మి సరస్వతి స్వరూపాలు. మనిషికి రెండు కలిగి వుండటం అన్నది పరమేశ్వరీ యొక్క ప్రసాదమే. 🌺 |