శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
672. బ్రహ్మాత్మైక్య స్వరూపిణి | ||
బ్రహ్మయే తానై వున్నది అహం బ్రహ్మాస్మి అన్న భావనే బ్రహ్మాత్మైక్య స్వరూపిణి. ఈ సృష్టిలోని ప్రతి రూపము, బ్రహ్మా రూపమైన పరాశక్తి నుండే ఉద్భవము పొంది , వృద్ధి చెంది, పరమేశ్వరిలోనే లయము పొందుతారు . బ్రహ్మాత్మైక్య స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺పరాశక్తి రూపమును తనలో ఆరాధించటము అన్న సాధన, జీవునిలో ఆత్మ స్థైర్యాన్ని పెంచుతుంది. 🌺 |