శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
677. బలిప్రియా | ||
త్యాగ ప్రియా కామ, క్రోధ, మద, మాత్సర్యములను త్యాగము చేయు వారియందు ప్రీతి కలిగినది.బలి అంటే మేక, గొర్రె వంటి జంతు బలి ఇస్తే అమ్మకి ప్రీతి అని భావిస్తారు. కాని అసలు మనలో వుండే అహంకార, మమకారాలను అమ్మకి సమర్పించాలి. త్యాగ ప్రీతియైన పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺ప్రేమ, అభిమానము, ఆప్యాయత వంటి లక్షణములను అలవాటు చేసుకుంటాము. 🌺 |