శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
635. గౌరీ | ||
గౌర వర్ణము కలిగి వున్నది పరాశక్తి ఎన్నో రూపాలు ధరించింది. అందులో ప్రధానమైనది పార్వతి. ఆమెనే గౌరీ అని సంబోధిస్తాము. తెలుపు, పసుపు, ఎరుపు రంగుల మిశ్రమము గౌరవర్ణము. గౌరిగా భర్త అయిన శివుడి మనసు గెలిచింది కాబట్టి.. పెండ్లి సమయంలో వధువుతో గౌరీపూజ చేయించడం సంప్రదాయంగా మారింది. వివాహ క్రతువులో గౌరీపూజ చేయడం వల్ల భార్యాభర్తల మధ్య అనురాగాలు సుస్థిరంగా ఉంటాయని నమ్మిక. పార్వతి స్వరూపమైన గౌరీ దేవికి నమస్కారము 🙏 🌺దాంపత్య జీవితములో కలిగే దుష్ట ప్రభావాలు తొలిగిపోతాయి 🌺 |