శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
643. జ్ఞానదా | ||
జ్ఞానమును ప్రసాదించునది జీవుని సర్వ సంపూర్ణముగా తీర్చిదిద్దుతుంది. ఆధ్యాత్మిక మార్గమున నడిపించి పూర్ణాభివృద్ధిని చేస్తుంది. ఆత్మ జ్ఞానాన్ని పొందునవారు,ఇతర బాహ్య సుఖములకు ఆరాటపడరు. జ్ఞాన స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺గురువు ద్వారా పొందిన జ్ఞానము సాక్షాత్ పరమేశ్వరీ ద్వారానే లభించి న అనుభవము కలుగుతుంది 🌺 |