శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
667. నిర్ద్వైతా | ||
ద్వైత రహితురాలు ద్వైత భావన లేకుండుటయే నిర్ద్వైతా. సృష్టి యందు వున్న సమస్తము పరాశక్తిరూపమే కాబట్టి, రెండవది అన్నది లేదు. పరబ్రహ్మ స్వరూపమైన పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺మనసా, వాచా, కర్మణా ఒకే బాటగా ధర్మకార్యాలను నిర్వర్తించ గలుగుతాము. మనసులో ఒక భావన , బాహ్యంగా మరొకభావన తో చేసి ఏ కార్యమైన దుష్ఫలితాన్ని ఇస్తాయి. *తస్మాత్ జాగ్రత్త *🌺 |