శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
641. ధ్యానగమ్యా | ||
ధ్యానముతో పరమేశ్వరిని చేరుకోగలము ధ్యాన సాధన వల్లనే పరాశక్తి కి చేరువు కాగలము. పరమేశ్వరిని పూజించటము, స్తోత్రం చెయ్యటమువల్ల మాత్రమే కాకుండా నిశ్చలమైన మనస్సుతో ధ్యానించటంచేత మాత్రమే పొందదగినది ఆ పరమేశ్వరి. అందుచేతనే ధ్యానగమ్యా అనబడుతుంది🙏 🌺ధ్యానముచేతనే ఆత్మజ్ఞానాన్ని పొందుతాము. పరమేశ్వరీ కృపకు పాత్రులమౌతాము 🌺 |