శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
661. సదసద్రూపధారిణీ | ||
మాయా రూపధారిణి. కనిపించే రూపము, కనిపించని రూపమును ధరించినది. వ్యక్తమైనదిగాను, వ్యక్తముకాని దానిగాను రూపముతో ప్రకాశిoచునది. రూపముయందు భేదము లేకుండా సకల జగత్తు యందు వ్యాపించి వున్నది. సత్యము అసత్యముగా, అసత్యము సత్యముగా మాయా రూపమును ధరించునది. 🙏 🌺సృష్టి యందు శాశ్వతము, ఆశాశ్వతము అన్న భేదమును తెలుసుకొనే ప్రయత్నము చేస్తాము 🌺 |