శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
647. లోపాముద్రార్చితా | ||
లోపా ముద్రాచే పూజింపబడునది అగస్త్యుని భార్య లోపా ముద్రాచే ఆర్చించబడినది. అగస్త్యుడు, విష్ణువు యొక్క అవతారమైన హయగ్రీవుని రూపము నుండి లోపా ముద్రా మాత లలితా సహస్రనామములను పలికినది. తనకి అత్యంత ప్రియమైన భక్తురాలు లోపాముద్రచే కీర్తింపబడు పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺శక్తి స్వరూపమైన ఆత్మ, తన భక్తుల విశ్వాసాన్ని పెంచుతుంది. ధైర్య సాహసాన్ని ప్రసాదిస్తుంది. భార్య భర్తల మధ్య కలహాన్ని తొలగిస్తుంది 🌺 |