శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
501. మాంసనిష్ఠా | ||
మాంస ధాతువును ఆశ్రయించివున్నది. శరీరములో మాంస ధాతువును ఆశ్రయించి, శరీర పుష్టిని, ఆరోగ్యాన్ని ప్రసాదించే దేవీ. గర్భములో స్వీకరించిన ఆహారము జీర్ణమైనతదుపరి, ధాతువైన రక్త మాంసములుగా మారుతాయి. ఈ మాంస ధాతువుని ఆశ్రయించి వున్న దేవత, జీవులకు వారి వారి ప్రారబ్ధాన్ని బట్టి చక్కటి రూపమును, బలమైన దేహమును ప్రసాదిస్తుంది.🙏 🌺శారీరిక బలహీనత లేకుండా, దృడమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది 🌺 |