శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
531. సర్వాయుధధరా | ||
అన్ని రకముల ఆయుధములను ధరించి వున్నది. అనంతమైన బాహువులు కలిగి వాటితో అన్ని రకాలైన ఆయుధములు ధరించి, దుష్టులను శిక్షిస్తూ, శిష్టులకు రక్షణ కలగిస్తుంది పరమేశ్వరీ 🙏 జీవుని యొక్క అజ్ఞానాన్ని ఆయుధములతో ఛేదించి , జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. 🌺 మనలో వుండే శత్రువు అనగా అజ్ఞానమును జయించి జ్ఞాన సంపదను పెంచుకుంటాము 🌺 |