శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
600. ధైత్యహంత్రీ | ||
రాక్షస సంహారిణి సాధన మార్గమున నడిచే తన భక్తులకు అసుర భావాలు, ఆలోచనలు కలగకుండా వాటిని సంహరిస్తుంది. దంభో దర్పోభిమానశ్చ , క్రోధః పారుష్య మేవచ అజ్ఞానం చాభిజాతస్య పార్ధా ! సంపదమాసురీం ! భగవత్ గీతలో 16 అధ్యాయం 4వ శ్లోకములో చెప్పబడినది. దంభము( గర్వము )దర్పము(పొగరు ),అభిమానము(అహంకారము )క్రోధము( కోపము )పరుషత్వం (పౌరుషము),అజ్ఞానము వంటి రాక్షస స్వభావములు మనిషిలో దాగి వుంటాయి. పరమేశ్వరీ ఆరాధనతో రాక్షస స్వభావము మన దరికి చేరకుండా కాపాడుతుంది.🙏 🌺రాక్షస స్వభావాన్ని ప్రయత్నపూర్వకముగా సాధనతో జయిస్తాము. 🌺 |