శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
588. శ్రీ షోడశాక్షరీవిద్యా | ||
పదహారు అక్షరాల విద్యా స్వరూపిణి శ్రీవిద్యలో ప్రధానమైన మంత్రం షోడశాక్షరి. దీన్నే శ్రీవిద్యా మహామంత్రము అని కూడా అంటారు. షోడశి అంటే 16 అక్షరాలు గల మంత్రం. పంచదశీ మహామంత్రానికి' శ్రీం' అనే బీజాన్ని గనక చేర్చినట్లైతే అది 16 అక్షరాలు గల షోడశాక్షరి అవుతుంది.ఈ మంత్రం సకల వేదసారము. పరమేశ్వరి స్వరూపము🙏 🌺ఈ నామ స్మరణ వల్ల జ్ఞానం కలుగుతుంది, ఏకాగ్రత కలుగుతుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది.🌺 |