శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
539. మేధా | ||
బుద్ధి స్వరూపిణీ. జీవులయందు బుద్ధి కర్తగా కర్మలను నిర్వర్తిస్తుంది. దక్షిణామూర్తి స్వరూపము మేధా శక్తి. ఆత్మ పరమాత్మ స్వరూపము. ఆత్మకు పుట్టుట, పెరుగుట, మరణించుట వుండదు. బంధాలు, మమకారాలు , ఈర్షా, ద్వేషాలు ఆత్మకి వుండవు. ఈ శరీరముతో వుండే బంధాలు ఆశాశ్వతము. ఈ రహస్యాన్ని తెలుసుకున్న వారు బ్రాహ్మజ్ఞాని. మేధా స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺తల్లి కృప, గురు కృప వల్ల ఆత్మ దర్శనము కలుగుతుంది 🌺 |