శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
516. పంచవక్త్రా | ||
ఐదు ముఖములతో వున్నది. పంచభూతములకు మూలమైనది, పంచేంద్రియములకు తగిన శక్తి ప్రసాదించేది. ఐదు ముఖాలతో వున్న గాయత్రీ స్వరూపము. సద్యోజాత, వామదేవ, ఈశాన, అఘోర, తత్పురుష అన్న ఐదు శివ తత్వ ముఖములతో విరాజిల్లుతోంది. నాలుగు ముఖములు నాలుగు దిక్కులను , ఐదవ ముఖము ఊర్ధ్వ ముఖము (ఆకాశము వైపు చూస్తుంది ). అన్ని దిక్కులయందు జరిగే సృష్టి, స్థితి, లయ, తిరోదానం, అనుగ్రహమునకు సాక్షిభూతిగా వుంటుంది పరమేశ్వరీ 🙏 🌺 మూలాధార చక్రము జీవుడికి అతి ముఖ్యమైన, మరియు చక్ర వ్యవస్థ అన్నింటికీ ఆధారము. మూలాధార చక్రంపై దృష్టి నిలిపి ధ్యానించి సిద్ధి పొందితే, సమస్త విద్యలలో ప్రావీణ్యంతోపాటు, వాక్పటుత్వము కలగడంతోపాటు అట్టి సాధకునికి కోరికలు నశించి ఆత్మానందాన్ని పొందుతాడు🌺 |