శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
536. స్వాహా | ||
దేవతలకు సమర్పించిన హవిస్సు స్వీకరిస్తుంది. దేవతలకు యజ్ఞములో హవిస్సును అర్పించునప్పుడు ఉచ్చరించు నామము. దేవతలకు ఇచ్చే ద్రవ్యాలను ‘హవ్యము’ అందురు. హవ్యములు ఇచ్చేటప్పుడు ‘స్వాహా' అని ఉచ్చరిస్తారు. స్వాహా అనగా స్వీకరించు అని అర్ధం. యజ్ఞంలో వేసే హవిస్సును స్వాహా దేవి స్వీకరిస్తుంది. భూమిపై వుండే మానవులు సుభిక్షంగా వుండాలి అని వేదం, యజ్ఞం అన్న ధర్మ వ్యవస్థ స్థాపించినది . యజ్ఞం చేసి దేవతలను సంతృప్తి పరిస్తే వారు మానవులను అనుగ్రహిస్తారు. పరమేశ్వరీ రూపములో వున్న స్వాహా దేవికి నమస్కారము 🙏 🌺నామము జపించడం వల్ల శ్వాస ప్రక్రియ చక్కపడుతుంది. 🌺 |