శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
590. కామకోటికా | ||
మోక్షదాయిని, కైవల్యస్వరూపీ శివ శక్తి స్వరూపమే కామకోటికా. 'కోటి’ అనగా అనంత ’అవధి’ అని అర్థం. 'కామ'అనగా కోరికలు,మోక్షము. కోరికల అవధిని, అనగా ’అంతాన్ని’ పొందుతారు. అంటే నిష్కామస్థితిని పొందుతారు. ధర్మార్ధ కామ మోక్షాలనబడే చతుర్విధ పురుషార్థాల స్వరూపిణి. ధర్మ బద్ధ మైన కామానికి అంతము మోక్షమే. . మోక్షదాయిని, కైవల్యస్వరూపీయైన జగన్మాతకు నమస్కారము 🙏 🌺జగన్మాతను నమ్మినవారు అన్ని కోరికలను సంపూర్ణంగా పొందుతారు🌺 |