శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
512. బందిన్యాది సమన్వితా | ||
బందినీ మొదలైన పరివార దేవతలతో కూడివున్నది స్వాధిష్ఠాన చక్రమునందు ఆరు పద్మ దళాలతో కూడివున్న యోగినీ దేవతలు బందిని, భద్రకాళి, మహామాయా, యశస్విని, రమ, లంభోష్టు. జీవుడియొక్క బందిన్యాది అనగా కామ, క్రోధ, లోభ, మోహ, మద,మాత్సర్యములు అనే ఆరు మాయా బంధనములతో కూడి వుంటాడు. దేవి మాయా చైతన్య స్వరూపిణీగా వీటియందు నివసించి వుంటుంది. దేవి యొక్క అనుగ్రహముతో వాటి నుంచి జీవుడు విముక్తుడు అవుతాడు. 🌺సమాజంలో నిరూపించుకోవడానికి అవసరమైన శక్తిని దేవి సమకూరుస్తుంది. 🌺 |