శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
509. అతిగర్వితా | ||
సౌందర్య రూపిణిగా ప్రకాశీస్తుంది. సృష్టి, స్థితి, లయ అన్నింటా ఆమె రూపకల్పనతో జరుగుతుంది కాబట్టి దేవీ అతిగర్వితా గా పిలవబడుతుంది. అనిమాది అష్ట సిద్దులను పొందినవారికి, అహంకారము, దర్పము వంటి మాయా లక్షణాలను కలిగించి వారిని పరీక్షిస్తుంది. మరల ఆమె సాక్షాత్కారముతోటే సాధకుడు మాయనించి విముక్తుడు అవుతాడు. అందుకని అతిగర్వితా అన్న నామముతో పూజింపబడుతుంది.🙏 🌺ఉద్యోగ, వ్యాపార రంగాలల్లో అతిఉన్నత స్థాయి కి చేరుకుంటారు 🌺 |